Wednesday, April 7, 2010


కన్నెగంటి బ్రహ్మానందం
Brahmanandam cu.jpg
జన్మ నామం కన్నెగంటి బ్రహ్మానందం
జననం ఫిబ్రవరి 01 1956 (1956-02-01) (వయసు 54)
ఇండియా
స్వస్థలం ముప్పాళ్ల గ్రామం, గుంటూరు జిల్లా
నివాసం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లు బ్రహ్మానందం
అరగుండు
ఖాన్ దాదా
కత్తి రాందాసు
వృత్తి హాస్య నటుడు
మతం హిందూ
సంతానం 2-కొడుకులు
గౌతమ్
తండ్రి నాగలింగాచారి
తల్లి లక్ష్మీనరసమ్మ

బ్రహ్మానందం ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా... వైవిధ్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు.
స్వల్పకాలములోనే వివిధ భాషలలో 750కి పైగా సినిమాలలోనటించి ప్రపంచములోనే అరుదయిన రికార్డు సృష్టించింది గిన్నీస్ ప్రపంచ రికార్డులు(2008వ సంవత్సరం)వారు గుర్తించారు. ఇప్పటికి ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలలో నటిస్తూవున్న హాస్య చక్రవర్తి.

విషయ సూచిక

[దాచు]

[మార్చు] బాల్యం

బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల గ్రామంలో జన్మించారు. తను పుట్టగానే తల్లికి గుర్రపువాతం వచ్చి అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే ఆరుగురు పిలలకి జన్మనిచ్చిన తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. తల్లి ప్రాణాలు దక్కినా బ్రహ్మానందం అనే పసివాడిపై మాత్రం అందరిదీ శీతకన్నే.

[మార్చు] చదువు

సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చారు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్భలంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎమ్మే పట్టా పుచ్చుకొన్నారు. బ్రహ్మానందం అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక సినీరంగంలో అడుగుపెట్టారు.

[మార్చు] సినీరంగ ప్రవేశం

ఇప్పట్లోలా ఇలా వెళ్లి అలా సినిమాలు చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటూ జనాభా కూడా ఎక్కువే! అమ్మ అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే తనకు వినోదం! తండ్రి రంగస్థల నటుడే అయినా సీరియస్ ప్రొఫెషనమీ కాదు. తలిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకీ అబ్బిందేమోనని బ్రహ్మానందం భావిస్తారు. బాల్యంలో మారాం చేయకుండా బడికి బుద్ధిగానే వెళ్ళినా, ఎస్.ఎస్.ఎల్.సి. లో గట్టిగానే పాసైనా చిన్న తప్పులు చేసినా తండ్రి నుంచి బుద్ధితక్కువ వాడంటూ చివాట్లు తప్పేవి కావు. అయితే తెలివితక్కువ వాడని మాత్రం ఆయన ఎన్నడూ అనలేదంటారు. చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు (మిమిక్రీ) చేయడం, సాంస్కృతిక బృందాలలో (కల్చరల్ ఆర్గనైజషన్) చురుకుగా పాల్గొనడం ఈయనకు అలవడింది. అత్తిలిలో లెక్చరర్‌గా ఉంటూనే పలు నిజజీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందిన బ్రహ్మానందం 1985లో దూరదర్శన్లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. దూరదర్శన్ తప్ప ఇతర ఛానెళ్ళేవీ లేని ఆ రోజుల్లో ఎక్కడికెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తు పట్టేవారు.

[మార్చు] తొలి సినిమా

బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవారు దర్శకులు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించారు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1 వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజ్‌లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా తొలిసారి విడుదలన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "సత్యాగ్రహం".

[మార్చు] పేరు తెచ్చిన పాత్ర

"...పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే అహ! నా పెళ్ళంట ! లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. "అరగుండు వెధవా" అని కోటతో తిట్టించుకొన్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం, తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాలగారు తను దర్శకత్వం వహిస్తున్న "చంటబ్బాయ్" సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవి కి పరిచయం చేయడం, తర్వాత "పసివాడి ప్రాణం" లో ఓ చిన్న పాత్ర వేయడం. ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహ నా పెళ్ళంట లో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకులు జంధ్యాలగారిని, అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు గారినీ, ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిగారిని ఎప్పటికీ మరువలేను అంటారు. ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో యేడాదికి 35 చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం.

[మార్చు] ప్రజాదరణ పొందిన ఊత పదాలు

  • నీ యంకమ్మా (చిత్రం భళారే విచిత్రం సినిమా)
  • పండగ చేసుకో (భిక్షగాడి పాత్ర ఆలీతో అర్థ రూపాయి దానం చేసి అనే డైలాగు)
  • రకరకాలుగా ఉంది మాస్టారూ (నువ్వు నాకు నచ్చావ్ సినిమా)
  • ఖాన్ తో గేమ్స్ ఆడకు... శాల్తీలు లేచిపోతాయి
  • దొరికాడా ఏశెయ్యండి...(పట్టుకోండి చూద్దాం)

[మార్చు] కుటుంబం

బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా పల్లకిలో పెళ్ళికూతురు అనే సినిమా వచ్చింది.

[మార్చు] అవార్డులు సత్కారాలూ

  • నటుడిగా బ్రేక్‌నిచ్చిన 'అహ నా పెళ్లంట' చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది. మనీ, అనగనగా ఒకరోజు, అన్న, వినోదం చిత్రాలకు సైతం నంది అవారుల్ని పొందారు.
  • ఐదు కళాసాగర్ అవార్డులు
  • తొమ్మిది వంశీ బర్కిలీ అవార్డులు
  • పది సినీగోయర్స్ అవార్డులు
  • ఎనిమిది భరతముని అవార్డులు
  • ఒక్క ఫిలింఫేర్ అవార్డు
  • రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం
  • ఆటా (అమెరికా), సింగపూర్, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల్నించి సన్మానాలు అందుకున్నారు
  • విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండరాన్ని తొడిగి సత్కరించారు
  • పద్మవూహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది
  • సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్‌వారు స్వరహస్తకంకణాన్ని బహూకరించారు.
  • అచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి డాక్టరేటు ను అందుకున్నారు
  • విఖ్యాత హస్యనటులయిన రేలంగి, రాజబాబు, చలం, అల్లు, సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకోవడం అరుధైన ఘటన!

[మార్చు] ఇతర విశేషాలు

  • 'రేలంగి తన ప్యాంటూ షర్టూ మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ తెరమీదికొచ్చాడ' ని కితాబులందు కొన్న నటుడు బ్రహ్మానందం
  • రెండు దశాబ్దాలుగా తన హాస్యనటనతో ఎన్నో మైలురాళన్లి అధిగమించి దాదాపు 745 చిత్రాల్లో నటించిన ఘనత వహించారు.
  • తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన ఆర్టిసుగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం.
  • ప్రతిష్టాత్మకమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అత్యధిక సినిమాలు నటించి నందుకు చోటు దక్కింఛుకున్న ఏకైక హాస్య నటుడు.

Saturday, August 15, 2009

begger grand mother died in khammam


begger grand mother died in khammam district in thirumalayapalem mandal.

Monday, July 27, 2009

premonmadam

ammailu..
jara jagrtatta
abbailu baga vikrutha chestalaku palpaduthunnaru
daniki meere badyulu
kadantara
enduko nenu chepthanu
kani eppudu kadu
repu chepthanu
ok na

Sunday, July 26, 2009

mudigonda naramedham vedio clipping

ముదిగొండ నరమేధం జరిగి రేపటికి రెండేళ్లు





ముదిగొండ నరమేధం జరిగి రేపటికి రెండేళ్లు
-సస్పెండైన అధికారులకు పోస్టింగులు
-కొనసాగుతున్న నిర్బంధం
-రేపు 2వ వర్థంతి సభ
-హాజరు కానున్న త్రిపుర సిఎం, బివిఆర్‌, తమ్మినేని

రాష్ట్ర ప్రభుత్వం సాగించిన ముదిగొండ నరమేధానికి మంగళవారంతో రెండేళ్లు కాబోతోంది. భూపోరాటం అణిచివేతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సాగించిన దారుణ మారణకాండలో ముదిగొండలో ఏడుగురు ఉద్యమ కారులు బలయ్యారు. ఈ ఘటనకు బాధ్యులుగా అప్పటి అడిషనల్‌ ఎస్‌పి రమేష్‌బాబు, సిఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఏడాది తిరగక మునుపే వారికి వరంగల్‌ రేంజ్‌లో పోస్టింగులు ఇచ్చింది. 2008 జూలై 28న ముదిగొండ సిపిఎం నేతలపై ప్రారంభమైన నిర్బంధం నేటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమరులను స్మరించడంతో పాటు ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సంస్మరణ సభను 28న నిర్వహించనున్నారు. ఈ సభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌తో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరు కానున్నారు.
రెండేళ్ల క్రితం జరిగిన పోలీసుల కాల్పుల ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 13 మందికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. రాష్ట్రబంద్‌లో భాగంగా ప్రశాంతంగా జరుగుతున్న రాస్తారోకోలో రాజకీయ రహితంగా జనం పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అతి చిన్న రహదారి, అంతటా బంద్‌ కావటంతో పెద్దగా వాహనాలు నిల్వలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగలేదు. రాస్తారోకోలో భాగంగా సభ జరుగుతున్న సమయంలో మొదట స్థానిక పోలీసులు వచ్చి విరమించాల్సిందిగా కోరారు. అందుకు ఆందోళనా కారులు నిరాకరించారు. వారు వెనుదిరిగారు. అటు తర్వాత కొద్ది సేపటికి అదనపు ఎస్‌పి రమేష్‌బాబు, స్పెషల్‌పార్టీ పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి హెచ్చరికలూ లేకుండా మొదట లాఠీఛార్జి, అటు తర్వాత యథేచ్ఛగా కాల్పులు జరిపించారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ముదిగొండ బస్టాండ్‌ ప్రాంతం రక్తసిక్తమైంది. బాధితుల
ఆర్తనాధాలు, పాలనా యంత్రాంగంపై మహిళలు పెట్టిన శాపనార్ధాల కేకలతో భీకర వాతావరణం నెలకొంది.
ప్రపంచ వ్యాపిత నిరసన
ముదిగొండ వరుస పరిణామాలను ఈటివి-2కి చెందిన కెమెరామెన్‌ రామారావు సమీపంలోని చెట్టు నుండి చిత్రీకరిం చారు. మిగతా సిబ్బంది ఎప్పటికప్పుడు నిరంతర ప్రసారానికి సహకరించారు. దీంతో ఘటన విషయం కొన్నిక్షణాల్లో విశ్వ వ్యాపితంగా ప్రాచుర్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. గంటల్లో వందల, వేలల్లో జనం రాజకీయ రహితంగా ముదిగొండ చేరుకున్నారు. పాశవికచర్యగా అభివర్ణించారు. బాధితులకు, ఉద్యమకారులకు బాసటగా నిలిచారు.
పరిహారం కోసం పోరాటం
కాల్పుల ఘటనలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు పరిహరం విషయంపై భారీ పోరాటం నడిచింది. కాంగ్రెస్‌ మినహా అన్ని పక్షాలూ ఆందోళనలో పాలు పంచుకున్నాయి. కొంతమంది కాంగ్రెస్‌ నేతలు వ్యక్తిగతంగా బాసటగా నిలిచారు. 26 గంటల పాటు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మృతదేహాలుంచి జోరువానలోనే ధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుండి పెద్దఎత్తున జనం కదిలొచ్చారు. ధర్నాను భగం చేయడానికి పోలీసులతో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. చివరికి ప్రభుత్వం దిగివచ్చి పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసి, పరిహారం ప్రకటించింది.
కొనసాగుతున్న నిర్బంధం
రెండేళ్లు పూర్తి కావస్తున్నా ముదిగొండలో నేటికీ నిర్బంధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సిపిఎం ముఖ్య నాయకత్వం టార్గెట్‌గా చర్యలు జరుగుతున్నాయి. కాల్పుల సందర్భంలో సిపిఎం జిల్లా నాయకులు బండి రమేష్‌ టార్గెట్‌గా పోలీసులు వ్యవహరించారు. అటు తర్వాత అనేక కేసులు పెట్టారు. ప్రస్తుతం చిరుమర్రిలో అధికారపార్టీ నేతలకు ఎదురైన పరాభావ ఘటనకు సంబంధం లేకపోయినా బండి రమేష్‌పై 302 సెక్షన్‌ కింద కేసుపెట్టి జైలుకు పంపారు. ఇలాంటివి నిర్బంధ చర్యలను స్పష్టం చేస్తున్నాయి.
(మరికొన్ని వివరాలు రేపటి సంచికలో)

Monday, April 27, 2009

amma muddubidda

ammaku papai muddubidda
adavi thalliki giri puthrudu muddubidda
mari
kooli pani chese ammakoo thana papae muddubidda